Saturday, May 28, 2022

క‌రీంన‌గ‌ర్ లో పలుచోట్ల వ‌ర్షాలు

కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులుతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలకు విద్యుత్ కు అంతరాయం ఏర్ప‌డింది. తెలంగాణ చౌక్ లో ఇటీవల ఏర్పాటు చేసిన 75 ఫీట్ల శ్రీరామ పట్టాభిషేకం కటౌట్ నెలకొరిగింది. రెండు గంటల పాటు కరీంనగర్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్మార్ట్ సిటీ రోడ్లు, వరద కాలువను తలపించాయి. కరీంనగర్ నుండి సిరిసిల్ల రోడ్ పనులకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల కోతలకు గుర‌య్యాయి. కరీంనగర్ లో ఉన్న మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ చౌక్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement