Monday, December 4, 2023

రైల్వే సమస్యల పరిష్కరించాలి.. రైల్వే జీఎంకు ఎమ్మేల్యే వినతి

పెద్దపల్లి రూరల్ : రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను కోరారు. సికింద్రాబాద్ నుండి రామగుండం వైపు వెళ్తున్న జీఎం పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో కాసేపు ఆగారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దాసరి జీఎంకు స్వాగతం పలికారు. పెద్దపల్లి, పొత్కపల్లి రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలను జీఎంకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లిలో హైదరాబాద్ టు నాగ్ పూర్, నవజీవన్ ఎక్స్ప్రెస్, దక్షన్, కేరళ వంటి రైళ్ళను ఆపాలని కోరారు.

- Advertisement -
   

కరీంనగర్ – పెద్దపల్లి రైలు మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జిలను విస్తరించాలని, మానేరు నదిపై నిరుపయోగంగా ఉన్న బ్రిడ్జి వద్ద ఆర్ఓబీ నిర్మించాలని విన్నవించారు. పెద్దపల్లి, పొత్కపల్లి రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యాలు మరింత మెరుగు పరచాలన్నారు. పెద్దపల్లి స్టేషన్ లో ఎస్కలేటర్, పొత్కపల్లిలోట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇంకా పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement