Thursday, April 25, 2024

ఉపరితల గని ప్రాజెక్టు అధికారిగా రఘుకుమార్..

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్జీ3 ఏరియా ఓసీపీ1 ఉపరితల గని నూతన ప్రాజెక్టు అధికారిగా కె. రఘుకుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన అధికారి శ్రీనివాసరావు జీఎం క్వాలిటీగా పదోన్నతిపై వెళుతుండగా ఆయన స్థానంలో రఘుకుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా అధికారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాసరావు, ఉదయ్‌ హరిజన్‌, శ్రీనివాస్‌, అఫ్సర్‌ పాషా, సునిల్‌ ప్రసాద్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement