Tuesday, March 19, 2024

డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞులు : సీపీ సుబ్బరాయుడు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేధించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఈనెల 15వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పైన పేర్కొన్న సాంకేతిక పరికరాలను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు వీటిని వినియోగించే అవకాశాలుండటంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేధించడం జరిగిందని చెప్పారు. ఎవరైనా వినియోగించదలచినట్లయితే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు..
కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని చెప్పారు.
ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి సంచరించకూడదు. రోడ్లు, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదు. పేన పేర్కొన్న ప్రాంతాలలో మ్యూజిక్ లు, పాటలు, ప్రసంగాలు చేయవద్దని కోరారు. ఈ ఉత్తర్వులు ఈనెల 15వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement