Thursday, April 25, 2024

గడ్డి మందు విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి – పెద్దపల్లి ఎస్‌ఐ రాజేశ్‌

పెద్దపల్లి : గడ్డి మందు విక్రయాల విషయంలో ఫెర్టిలైజర్‌ షాప్‌ యజమానులు జాగ్రత్తలు పాటించాలని పెద్దపల్లి ఎస్‌ఐ రాజేశ్‌ పేర్కొన్నారు. శుక్రవారం పద్దపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫెర్టిలైజర్‌ షాప్‌ యజమాలతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల గడ్డి మందు తాగుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు పెరిగి పోయాయన్నారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించడం ద్వారా అందులో ఉండే అత్యధిక మోతాదు రసాయనాల ప్రభావంతో శరీరంలోని అవయవాలు దెబ్బతిని క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయన్నారు. ఎవరైనా వ్యక్తులు ఫెర్టిలైజర్‌ షాప్‌కు వచ్చి గడ్డి మందు కావాలని అడిగితే వారి వివరాలు తప్పక నమోదు చెసుకోవాలని సూచించారు. వారి సంబంధికులకు సదరు వ్యక్తి గడ్డి మందు కొనడానికి వచ్చినట్లు సమాచారం అందించి, అవసరమా కాదా కాదా ఆరా తీయాలన్నారు. వచ్చిన వ్యక్తి వివరాలు తెలియనట్లయితే ఎట్టి పరిస్థితుల్లో గడ్డి మందు విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తమ సూచనలు పాటిస్తూ రికార్డ్స్‌ నమోదు చేయడం ద్వారా ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడిన వారమవుతామన్నారు. తప్పనిసరిగా వివరాలు నమోదు చేస్తూ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఫెర్టిలైజర్స్‌ షాప్‌ యజమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement