Thursday, April 25, 2024

ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు..

వేములవాడ: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్‌ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వేములవాడ నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు కనికరపు రాకేష్‌ డిమాండ్‌ చేశారు. వేములవాడ పట్టణంలో మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సందర్భంలో మళ్లీ క్లాసులు నిర్వహించడం ప్రభుత్వంపై చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. కరోనా కష్ట కాలంలో చాలామంది మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులకు గురైతే ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకులు మాత్రం ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరిట అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యా సంస్థల నిర్వహకులపై కఠినచర్యలు తీసుకోని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలకని రాజు, వస్తాది కృష్ణగౌడ్‌, పోతుగంటి వెంకన్న, పల్ల కొండ అమర్‌, గుండం సంతోష్‌, గికురు సాయి, వంగ ప్రణయ్‌ గౌడ్‌, సచిన్‌, సాగర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement