Friday, January 21, 2022

రైస్ మిల్లులపై మెరుపు దాడులు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రైస్ మిల్లులపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. బియ్యం రీసైక్లింగ్ చేసి తరలిస్తున్నారని సమాచారం మేరకు మానకొండూర్ లోని రెండు రైస్ మిల్లుపై సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బియ్యం శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. ఇద్దరు రైస్ మిల్ యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. సబ్సిడీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. ఇకపై మరిన్ని దాడులు నిర్వహిస్తామని చెప్పారు. సబ్సిడీ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పోలీస్ శాఖ, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News