Wednesday, April 24, 2024

జులాయి లకు పోలీసుల ఝలక్ .. ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తామని హెచ్చరిక

పెద్దపల్లి – లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న జులాయి లకు పెద్దపెల్లి పోలీసులు ఝలక్ ఇచ్చారు. గురువారం ఉదయం పది గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన యువకులను అదుపులోకి తీసుకొని కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ కు తరలిస్తామని సుల్తానాబాద్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఫ్లెక్సీ పొందుపరిచిన డీసీఎం వ్యాన్ లో ఎక్కించడం తో ఒక్కసారిగా హడలిపోయారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డిసిపి రవీందర్ మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న కొంతమంది యువకులు రోడ్లపైకి తిరుగుతున్నారని వారిని మందలించా లని వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రదీప్ కుమార్ ఎస్సై లు రాజేష్, ఇసాక్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement