Thursday, April 25, 2024

ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు: పెద్దపల్లి ఏసిపి

ఉత్తమ సేవలు అందిస్తే పోలీస్ శాఖలో తగిన గుర్తింపు లభిస్తుందని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి పేర్కొన్నారు. శనివారం ఏసీపీ కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్, రోడ్ సేఫ్టీ విభాగంలో ఉత్తమ సేవలందించినందుకు గాను మౌనిక తో పాటు కానిస్టేబుల్ కు నగదు రివార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందని, ప్రతినిత్యం క్రమబద్ధీకరణకు కృషి చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టడంతో పాటు రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధిస్తున్నామన్నా రు. జిల్లా కేంద్రంలో రహదారిపై ఆక్రమణలు తొలగిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement