Friday, April 19, 2024

పల్లె పల్లెకు బిజెపి జెండా ఎగరాలి..

రామగిరి: నియోజకవర్గంలోని పల్లె పల్లెన బిజెపి జెండా ఎగరవేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్‌రెడ్డి పేర్కొన్నారు. బిజెపి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రామగిరిలోని తెలంగాణ చౌరస్తా వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, మంథనిలో బిజెపి గెలుపు ఖాయమన్నారు. గ్రామ గ్రామాన కాషాయ జెండాను ఎగరవేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దుల్ల ఐలయ్య, ముల్మురి శ్రీనివాస్‌, సదానందం, శ్రీనివాస్‌తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement