Thursday, April 25, 2024

ఆయిల్ పామ్ సాగు లాభదాయకం : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని, ఆయిల్ వాడకం రోజు రోజుకీ పెరుగుతున్నందున రైతులు నిశ్చింతంగా ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చని పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.ఆదివారం జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామంలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో 14 ఎకరాలలో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆయిల్ పామ్ మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రోజువారి అవసరాలకు ఆయిల్ ఎంతో ముఖ్యమైనదని, భారత దేశానికి ఎక్కువగా మలేషియా నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతున్నదని, ఆయిల్ వాడకం రోజు రోజుకీ పెరుగుతున్నదనే తప్ప తగ్గదని, రైతులు నిశ్చింతంగా ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చని, పంట పెట్టిన మొదటి నాలుగు సంవత్సరాలు అంతర పంటలు వేసుకొని రైతులు ఆదాయం ఆర్జించవచ్చని, నాల్గవ సంవత్సరం నుండి ఆయిల్ పామ్ దిగుబడి మొదలై , ఆరు, ఏడో సంవత్సరం నుండి ఒక ఎకరంలో నికర లాభము లక్ష వరకు సంపాదించవచ్చని, అలాగే ప్రభుత్వం డ్రిప్ పై సబ్సిడీని అందించడం జరుగుతుందని తెలిపారు.మండలంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టిన రైతులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సి. జగన్మోహన్ రెడ్డి, జూలపల్లి ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, సర్పంచ్ మహంకాళి తిరుపతి, వైస్ ఎంపీపీ., ఎంపీటీసీ, జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది చొక్కా రెడ్డి, పెద్దపల్లి డివిజన్ ఉద్యాన అధికారి ఏ. జ్యోతి, రామగుండం అధికారి శ్రీకాంత్, జూలపల్లి వ్యవసాయ అధికారి టి ప్రత్యూష, వ్యవసాయ విస్తరణ అధికారి టి రాకేష్, తిరుమల ఆయిల్ కంపెనీ సీఈవో కేసు కళ్యాణ్కర్, ఫీల్డ్ ఆఫీసర్ మహేష్, ఇతర గ్రామాల ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement