Saturday, May 8, 2021

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి..

జూలపల్లి: రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని వైస్‌ ఎంపీపీ మొగురం రమేశ్‌ పేర్కొన్నారు. మండలంలోని బాలరాజుపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ కుంటూరి రాజయ్య, ఉపసర్పంచ్‌ అడువాల తిరుపతి, రాకం భాస్కర్‌, మల్లేశం, కొల్లూరి స్వామి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News