Wednesday, May 19, 2021

మౌళిక సౌకర్యాల మెరుగుకు కృషి..

పెద్దపల్లి రూరల్‌: పల్లె పల్లెకు మౌళిక సౌకర్యాలను మరింత మెరుగుపరించేందుకు కృషి చేస్తున్నానని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తుర్కల మద్దికుంటలో రూ. 5.43లక్షల ఎస్‌ఎఫ్‌సీ నిధులతో నిర్మాణం చేపట్టే సీసీరోడ్డు పనులు, గ్రామపంచాయతీ నిధులతో పంచాయతీ కార్యాలయం చుట్టూ ప్రహారీగోడ, ఫ్లోరింగ్‌ విస్తరణ పనులకు ఎమ్మెల్యే దాసరి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలను మెరుగుపరిచి పల్లెలను అభివృద్ధి బాటలో ముందుంచడమే లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని గుర్తు చేశారు. రైతు వేదిక, పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, సెగ్రిగేషన్‌ షెడ్డులాంటి అనేక కార్యక్రమాల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయగా, ఇప్పటికే పనులు పూర్తి చేశామన్నారు. రానున్న రోజుల్లో పల్లెల్లో మరిన్ని సౌకర్యాలను విస్తృతం చేసి మెరుగు పరుస్తామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని తెరాస ప్రభుత్వ హయాంలో చేసి చూపిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలో నంబర్‌ వన్‌గా ఉందని కొనియాడారు. సర్పంచ్‌ తంగళ్ల జయప్రద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఈకార్యక్రమంలో జడ్పీటీసీ బండారు రామ్మూర్తి, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ గౌడ్‌, వైస్‌ ఎంపీపీ ముత్యాల రాజయ్య, మండల కో- ఆప్షన్‌ హబీబుర్‌ రెహమాన్‌, ఉపసర్పంచ్‌ ఈదునూరి జాన్‌తోపాటు తెరాస నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News