Sunday, July 25, 2021

గ్రామాలభివృద్ధే లక్ష్యం — ఎమ్మెల్యే దాసరి

కాల్వశ్రీరాంపూర్‌: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కునారం గ్రామంలో ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ. 20లక్షలతో చేపట్టిన అంతర్గత సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీ-సీ వంగళ తిరుపతి రెడ్డి, మార్కెట్‌ ఛైర్మెన్‌ కొట్టే సుజాత రవి, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌ లు గజవెల్లి పురుషోత్తం, చదువు రామచంద్రారెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మెన్‌ రామచంద్రారెడ్డి, సర్పంచ్‌ డొంకేన విజయ-మోగిళి, ఎంపీటీ-సీ రాజేశ్వరి-రాయమల్లు, కొట్టే సమ్మయ్య,ఉప సర్పంచ్‌ తిరుపతి, సంతోష్‌, ఏఎంసీ డైరెక్టర్‌ కుంభం సంతోష్‌, సర్పంచ్‌ లు, ఎంపీటీ-సీల ు, మహిళలు, పాలక వర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News