Saturday, April 20, 2024

సీబీఐ విచారణపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ 

శ్రీనివాస్ అనే వ్యక్తిని సీబీఐ ఇటీవల అరెస్టు చేసింద‌ని, శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శ్రీనివాస్ పేరు విన్న కానీ కలవలేద‌ని, కాపు సంఘంలో తిరిగే వాడ‌ని, దర్మెందర్ అనే వ్యక్తి చెప్తే కలిసేందుకు అతను ఉన్న స్థలంలోకి వెళ్లి పరిచయం చేసుకున్నామన్నారు. మున్నూరు కాపు కులంలో ఐపీఎస్ కదా అని గర్వంగా ఫీల్ అయ్యం అని చెప్ప‌డం జ‌రిగింద‌న్నారు. అతని భార్య కూడా ఐఏఎస్ అన్నారు కదా ఆమెను కూడా కలవాలని చెప్పాను అని వివరించారు. ఆ రోజు అతనితో దిగిన ఫోటో అధికారుల వద్ద ఉందని, ఆ రోజు మరుసటి రోజు గంట సేపు మామూలుగా మాట్లాడింది తప్ప అంతకు మించి ఏమీ లేదన్నారు. మంత్రి కదా అని నన్ను కూడా విచారణకు పిలిచారు.. నా ఫొటోలు కాల్ లిస్ట్ సీబీఐ దగ్గర ఉంద‌న్నారు. అన్ని ప్రశ్నలు అడిగారు.. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని చెప్పారు. మళ్ళీ మళ్ళీ పిలవడం బాగుండదని కాసేపు ఉండండి అంటే ఆగాము.. నన్ను కేవలం 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారు. ఇప్పటి వరకు శ్రీనివాస్ నాతో ఎలాంటి పనులు అడగలేదు.. నేను కూడా అతడిని ఏ పని అడగలేదని స్పష్టం చేశారు. మా బావ అయిన ఎంపీ వద్ధి రాజు రవి చంద్రకి అతను పరిచయం.. శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి మా బావను సహాయం చేయమని అడిగారని తెలిసింది. 15 లక్షల రూపాయల విలువ ఉద్దేర ఇప్పించాడు అదే విషయాన్ని మొన్న చెప్పామన్నారు. ఆ డబ్బులు ఇంకా అలాగే బకాయి ఉందని,
మాకు ఎదీ అయినా పని ఉంటే నేరుగా అధికారులతో మాట్లాడతాము అన్నారు. మేము మధ్య వర్తులతో మాట్లాడాల్సిన పని మాకు లేద‌న్నారు. మేము బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎవరిని కలవాల్సిన అవసరం లేదన్నారు. మమ్మల్ని ఎన్ని రకాల ప్రశ్నలు వేసినా నిజం ఇదే అని నొక్కి చెప్పారు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ రోజు ఎవరితో లావాదేవీలు జరపలేదు కాబట్టి మాకు ఎవరికి అనుమానం రాలేద‌న్నారు. అతను కులంలో కేవలం గొప్పలు చెప్పుకొని తిరిగాడన్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి సీబీఐ అని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని మొన్న విచారణ లో తేలిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement