Sunday, February 5, 2023

సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన మంత్రి, ఎంపీ

రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, ఎంపీ, వ‌ద్దిరాజు ర‌విచంద్ర ధ‌న్య‌వాదాలు తెలిపారు. నిన్న ఖమ్మం సభలో మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అందుకు సంబంధించిన 300 మీటర్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ఈరోజు రూ.180 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. మున్నేరు కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి జీవో విడుదల చేసిన సందర్భంగా ఈరోజు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను మంత్రి, ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement