Wednesday, May 19, 2021

వర్షపు నీరు నిల్వ ఉండకుండా మరమ్మతులు..

పెద్దపల్లిరూరల్‌: మండలంలోని పెద్దకల్వల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షాకాలంలో వరద నీరు నిల్వ ఉండకుండా మరమ్మతులు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పిస్తూ పాఠశాల మైదానంలో మొరం పోసి చదును చేయిస్తున్నారు. సర్పంచ్‌ కారెంగుల రమేశ్‌ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి రణధీర్‌ పనులు పర్యవేక్షించారు. పాఠశాల ఆవరణ మొత్తాన్ని చదును చేయించి వృథా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News