Tuesday, September 28, 2021

జగిత్యాలలో విషాదం.. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో ఓ కుటుంబ వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఓ కుటుంబంలో గొడ‌వలు చినికిచినికి గాలివాన‌లా మార‌డంతో ఓ వ్య‌క్తి భార్య‌ను హ‌త‌మార్చి ఆపై తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. నాచుపల్లి గ్రామానికి చెందిన బత్తిని దేవయ్య, ప్ర‌మీల ఇద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. వారి ఇంట్లో ఈ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇవాళ దేవ‌య్య భార్య‌ను హ‌త్య‌చేశాడు. అనంత‌రం అత‌ను కూడా ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న మాల్యాల సీఐ, కొడిమ్యాల ఎస్ఐ ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని కేసు దర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News