Saturday, October 5, 2024

KNR: నిరుద్యోగ సమస్యలపై గళమెత్తుతా… నరేందర్ రెడ్డి

ఆంధ్రప్రభ, కరీంనగర్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు తనను ఆదరించి మండలికి పంపిస్తే నిరుద్యోగ సమస్యలపై గళ మెత్తుతానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద ర్ రెడ్డి కోరారు. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కేటీఆర్ పార్కులో వాకర్స్ ను కలిసి మద్దతు కోరారు.

3దశాబ్దాలుగా విద్యారంగంలో ఉన్న తాను వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశానన్నారు. ఆంధ్ర వాళ్ల స్కూళ్లు, కళాశాలలకు దీటుగా తెలంగాణ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించినట్లు, విద్యా ర్థులు, నిరుద్యోగులు, యువత సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.

తమ విద్యాసంస్థల ద్వారా ఏటా 40వేల మంది విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందిస్తున్నామన్నారు. మేధావి వర్గం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement