Tuesday, October 19, 2021

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర..

కాల్వశ్రీరాంపూర్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని సర్పంచ్‌ పొన్నమనేని దేవేందర్‌రావు, ఉపసర్పంచ్‌ గరిడే అశోక్‌లు పేర్కొన్నారు. మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు కేంద్రానికి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కంటల వీరన్న, భాగ్యలక్ష్మి, ప్రసజ్ఞ, సీసీ నిర్మల, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News