Sunday, July 25, 2021

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర..

చందుర్తి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని సింగిల్‌ విండో చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. చందుర్తి మండలంలోని మర్రిగడ్డ, కట్టలింగంపేట గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్‌ శ్రీనివాస్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను ఆశ్రయించి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జలపతి, ఎనుగుల జమున శ్రీనివాస్‌, ఎంపీటీసీలు దారం కావ్య బాల్‌రెడ్డి, పెగ్గెర్ల రమేశ్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ పుల్కం మోహన్‌, డైరెక్టర్లు నేదూరి శంకర్‌రెడ్డి, నగరం శోభ శంకర్‌, ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి, వార్డుసభ్యులు, నాయకులు లక్ష్మణ్‌రావు, వైకుంఠం శ్రీనివాస్‌, బాలు, మనోహర్‌, శ్రీనివాస్‌, సీఈఓ గంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News