Thursday, September 21, 2023

TS: మానవతకు మారుపేరు కేసీఆర్… ఎమ్మెల్యే రసమయి

మానకొండూర్ నియోజకవర్గం : సంక్షేమ పథకాలతో ప్రతి నిరుపేద కుటుంబంలో విలువలు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతకు మారుపేరని మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ తెలియజేశారు. గురువారం మానకొండూర్ నియోజజవర్గంలోని మైనార్టీ సోదరీమణులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

- Advertisement -
   

అనంతరం మాట్లాడుతూ… అన్నివర్గాల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి మానకొండూర్ నియోజకవర్గంలో చేసి చూపామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణా రావుతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement