Wednesday, April 24, 2024

కార్మిక చట్టాల కోడ్‌ పత్రుల దహనం

ఎన్‌టీపీసీ: కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఎన్టిపిసి ప్లాంట్‌ గేట్‌ నెంబర్‌2 వద్ద సిఐటియు, ఐఎప్టి ఎన్ యు, ఏఐటియుసి, టిఎన్టియుసి, ఐఎప్టిఎన్ యు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్‌ కోడ్‌ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ 49 కార్మిక చట్టాలను 4 కోడ్‌ లుగా, పారిశ్రామిక సంబంధాల కోడ్‌- 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ 2020, సామాజిక భద్రత కోడ్‌ 2020, వేతనాల కోడ్‌ 2019లుగా మార్చి కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా చేశారన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసి పదేళ్లయినా కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మిక చట్టాలను మార్చడం సిగ్గుచేటన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టదాయకం కలిగించే చర్యలను మానుకొని, 4 లేబర్‌ కోడ్‌లను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో సిఐటియు నాంసాని శంకర్‌, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎప్టిnయు చిలుక శంకర్‌, బుచ్చన్న, టీ ఎన్టీయూసీ శ్రీనివాస్‌, ఏఐటియుసి లక్ష్మణ్‌, ఐఎప్టిnయు భూషణం, నాయకులు దండ రాఘవరెడ్డి, కాదశి మల్లేష్‌, చంద్రమౌళి, షమీం, రాజయ్య, పోచయ్య, సత్యనారాయణ రెడ్డి, సత్తయ్య, శివపాల్‌ సింగ్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement