Monday, May 29, 2023

దమ్ముంటే నా మీద పోటీ చెయ్.. సీఎం కేసీఆర్‌కు ఈటల స‌వాల్..

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు త‌మ్ముంటే నా మీద హుజూరాబాద్ లో పోటీ చేయాల‌ని బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.
ఏపీ, యూపీ, కర్ణాటకలో కేసీఆర్‌ డబ్బులు పంచారని ఆరోపించారు. కేసీఆర్ కు దమ్ముంటే నా హుజూరాబాద్‌లో పోటీ చేయాలి. నన్ను రమ్మంటే గజ్వేల్ వచ్చి కేసీఆర్‌ను ఢీ కొడతా అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ను తాము కూల్చాల్సిన అవసరం లేదని…. అదే కూలిపోతుందన్నారు. సర్వేలకు, మీడియాకు అందని రిజల్ట్ మునుగోడులో ఉంటుందని తెలిపారు. కేటీఆర్ దత్తత తీసుకుంటా అని చెప్పడం బ్రోకర్ మాటలని మండిపడ్డారు. డబ్బులు, మద్యంతో గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నారని… అదంతా కలన్నారు. టీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన మునుగోడులో గెలిచేది బీజేపీ నే అని ఈట‌ల అన్నారు. రాత్రికిరాత్రి పోస్ట‌ర‌న్లు అంటించి అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని వీట‌న్నిటికీ ప్ర‌జ‌లే త‌మ ఓటుతో బుద్ది చెబుతార‌న్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement