Monday, September 25, 2023

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

ఓదెల : తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఓదెల మండల పరిషత్‌ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారుల‌కు కళ్యాణలక్ష్మి ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం సీఎం కేసీఆర్‌ కానుకగా అందిస్తున్నారని, కల్యాణలక్ష్మితో పేదల‌ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రత్యేక ప్రణాళికతో పథకాలు అమలు చేయడం ప్రజల అదృష్టమన్నారు. దేశానికే తెలంగాణను దిక్సూచిగా మార్చిన సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, జడ్పిటిసి గంట రాములు, సింగిల్ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆళ్ల రాజిరెడ్డి, సర్పంచులు గుండేటి మధు, పులుగు తిరుపతిరెడ్డి, తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఆర్‌ఐ రాజేందర్‌, ఉపసర్పంచ్‌ తీర్థాల కుమార్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ బోడకుంట నరేశ్‌, నాయకులు ఆవుల మహేందర్‌, వస్త్రంనాయక్‌, ఒజ్జె శ్రీనివాస్‌, కనిగిరి రెడ్డి సతీష్‌, శ్రీకాంత్‌ గౌడ్‌, చింతం వెంకటస్వామితోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement