Saturday, April 20, 2024

ఘనంగా హోలీ వేడుకలు

జూలపల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని వడ్కాపూర్‌ గ్రామంలో గణేష్‌ యూత్‌ సభ్యులతోపాటు- పలువురు యువత పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు గ్రామాల్లో చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు రంగులు పూసుకున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా హోలీ వేడుకలలో నిబంధనలు పాటించారు. చిన్నారులు. యువత కేరింతలు కొడుతూ హోరెత్తించారు. ఈకార్యక్రమంలో తీగల రమేష్‌, చరేణి సతీష్‌యాదవ్‌, గుమ్మడి లక్ష్మణ్‌, గుమ్మడి హరీష్‌, సుంకే శ్రీనివాస్‌, టి. లక్ష్మణ్‌, నర్సింగం, జెట్టి రాజు, ఒడ్నాల హరీష్‌తో పాటు- చిన్నారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement