Tuesday, March 26, 2024

Yellampalli ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 20 గేట్స్ ఎత్తివేత..

ఎల్లంపల్లి ప్రాజెక్టు కు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఓపెబ్ చేయడంతో పాటు గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండటంతో ఇన్ ఫ్లో పెరిగింది. 1,59,987 క్యూ సెక్కులు ఇన్ ఫ్లో కాగా 20 గేట్లు ఓపెన్ చేసి దిగువకు 1,66,550 నీటిని వదులుతున్నారు. డ్యామ్ కెపాసిటీ 20.17 టిఎంసిలు కాగా నీటిమట్టం 16 టీఎంసీలకు చేరుకుంది. కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండీకి ఇన్ ఫ్లో పెరిగింది. దిగువ నుండి 1899 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా కాకతీయ కెనాల్ ద్వారా 232 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement