Saturday, April 1, 2023

రోడ్డుకు నిధుల మంజూరు పట్ల హర్షం.. ఎమ్మెల్యే దాసరి చిత్రపటానికి పాలాభిషేకం

ఓదెల : మండల కేంద్రమైన ఓదెల జగదాంబ సెంటర్‌ నుండి ఒర్రెగడ్డ- కనగర్తి రోడ్డు లింకుకు 50 లక్షల డీఎంఎఫ్టీ రూపాయల నిధులు మంజూరు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల జెండా వద్ద మాజీ సర్పంచ్‌ మండల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆకుల మహేందర్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు పార్టీ శ్రేణులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ గ్రామానికి చిరకాల కోరికను నెరవేర్చేందుకు ఎమ్మెల్యే దాసరి ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేయించడం పట్ల సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చిన్నస్వామి, ఉప సర్పంచ్‌ తీర్థాల కుమార్‌, మల్లన్న గుడి ధర్మకర్త కనికిరెడ్డి సతీష్‌, బోడకుంట నరేష్‌, బుద్దే పోశెట్టి, రమేష్‌, కుమార్‌, వెంకటస్వామి, బుద్దే కుమార్‌, వంగ రాయమల్లు, సునీల్‌, ఎర్ర మల్లయ్య, పడాల మల్లయ్యలు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement