Friday, March 29, 2024

పెద్దపల్లిలో కేసీఆర్‌కు ధాన్యాభిషేకం

పెద్దపల్లి : రైతు అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి వినూత్న రీతిలో ధాన్యంతో అభిషేకం నిర్వహించారు. సోమవారం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గ్రామంలో పీఏసీఎస్‌ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరై ధాన్యాభిషేకం చేసి కేసీఆర్‌ రైతుల కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. దేశంలోనే రైతుల కోసం ఆలోచన చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని గుర్తుచేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పీఏసీఎస్‌ ఛైర్మెన్‌ మాదిరెడ్డి నరసింహా రెడ్డి, యూత్‌ మండలాధ్యక్షుడు కొయ్యడ విక్రమ్‌, సర్పంచ్‌ కొమ్ము శ్రీనివాస్‌,డైరెక్టర్‌ లు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, నాయకులు సంతోష్‌, రాజు, శ్రీనివాస్‌, నర్సయ్య, పాలకవర్గం, హమాలీలు, తెరాస నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement