Wednesday, April 14, 2021

ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ..

కాల్వశ్రీరాంపూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఎంపీపీ నూనెటి సంపత్‌, జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, ఎంపీడీవో కిషన్‌ నాయక్‌, ఏపీఎం సదానందం పేర్కొన్నారు. మండలంలోని శ్రీరాంపూర్‌ క్లస్టర్‌లోని కాల్వ శ్రీరాంపూర్‌, మల్యాల, ఇప్పలపల్లి, గంగారం గ్రామాల కార్యదర్శులు, సర్పంచులు, పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘం సభ్యులకు కు తడి, పొడి చెత్త సేకరణ, గణ వ్యర్ధ పదార్థాల సక్రమ నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వర్మి కంపోస్టు తయారీ చేయడం వల్ల పంచాయతీలకు ఆదాయం చేకూరుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి పరిశుభ్రమైన, స్వచ్ఛమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గోవర్ధన్‌, సర్పంచ్‌లు ఆడెపు శ్రీదేవి రాజు, కొనక టి మల్లారెడ్డి, లంక రాజేశ్వరి సదయ్య, మర్రి సంగీత మహేందర్‌, ఎంపీటీ-సీ గడ్డం రామచంద్రం, కార్యదర్శులు, సీసీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News