Tuesday, October 3, 2023

గంజాయితో బంగారు జీవితం బుగ్గిపాలు.. సిపి సుబ్బారాయుడు

గంజాయితో పాటు మాదకద్రవ్యాల వాడకం వల్ల బంగారు జీవితం బుగ్గిపాలవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆడిటోరియంలో మాదకద్రవ్యాల ఉపయోగం వాటి వల్ల జరిగే దుష్పరిమానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… యువత గంజాయికి అలవాటు పడి విలువైన జీవితం నాశనం చేసుకుంటున్నారన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గంజాయి లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి విక్రయించినా, సరఫరా చేసినా, నిల్వ ఉంచుకున్నా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి వాడే అలవాటు ఉన్నవారు వెంటనే మానుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఏసీపీలు తులా శ్రీనివాసరావు, కరుణాకర్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement