Saturday, April 10, 2021

చికిత్స పొందుతూ గీత కార్మికుడి మృతి..

పెద్దపల్లిరూరల్‌: మండలంలోని గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన ఉత్కం అంజయ్య గౌడ్‌ (65) అనే గీత కార్మికుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత వారం రోజుల క్రితం వృత్తి పనిలో భాగంగా తాటిచెట్టుపై నుంచి కాలు జారి కింద పడడంతో తీవ్ర గాయాల పాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వివరించారు. అంజయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News