Saturday, March 23, 2024

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు..

పెద్దపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో ఇవాళ ఆటో, లారీ, మినీ ట్రక్కు డ్రైవర్లకు ట్రాఫిక్, సివిల్, రవాణ శాఖ అధికారులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి.. మందులు, కళ్ళజోళ్ళు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రూపేష్, ఎసిపి సారంగపాణి, సిఐలు అనిల్ కుమార్, ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డితో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement