Thursday, April 25, 2024

ఇండ్లు కోల్పోయిన వారికి – ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేయూత

జగిత్యాల నియోజకవర్గం లో భారీ వర్షాలకు ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆర్థిక చేయూత అందించారు. సారంగాపూర్ మండల నాగు నూరు,లచ్చాక్క పెట్ గ్రామాల్లో ఇటీవల భారీ వర్షాలకు 6 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా తక్షణ సహాయంగా ప్రభుత్వం ద్వారా మంజూరైన మొత్తాన్ని లబ్ధిదారులకు ఆయా గ్రామపంచాయతీల వద్ద అందజేశారు. అనంతరం గ్రామాల్లో పలు సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తూ,వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఎమ్మేల్యే వెంట సారంగాపూర్ మండల ప్రజా ప్రతినిదులు,సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు,
నాయకులు,వివిధ హోదాల్లో ప్రజా ప్రతినిదులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement