Friday, February 3, 2023

మౌళిక సదుపాయాల కల్పనకు కృషి.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి : ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో రూ.2.75కోట్ల పురపాలక సంఘం నిధులతో నిర్మిస్తున్న వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా కేంద్రంగా మారిందని, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు కూరగాయలు, మాంసం కొనేందుకు వచ్చే సందర్భంలో అధునాతన సౌకర్యాలతో మార్కెట్‌ నిర్మాణం చేపడతామన్నారు.

- Advertisement -
   

గత పాలకుల హయాంలో పెద్దపల్లి అభివృద్ధికి నొచుకోలేదని, గత 8 ఏళ్లుగా 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ల సహకారంతో రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ మమత ప్రశాంత్‌రెడ్డి, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్‌ శివప్రసాద్‌తోపాటు కౌన్సిలర్లు, కో- ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement