Sunday, October 13, 2024

Peddapalli: క్షణికావేశంలో కేసుల పాలు కావొద్దు…

పెద్దపల్లి జిల్లా న్యాయమూర్తి డా.హేమంత్ కుమార్
పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 28(ప్రభ న్యూస్): క్షణికావేశంలో కేసుల పాలు కావొద్దని జిల్లా న్యాయమూర్తి దాచ్యర్ హేమంత్ కుమార్ ప్రజలకు హిత బోధ చేశారు. పెద్దపల్లి సీనియర్ కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ lom అదాలత్ లో ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడారు.

కక్షిదారులు రాజీ కుదుర్చుకుంటే రాజమార్గం ఏర్పడుతుందని, కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. పంతాలకు పోకుండా రాజీ మార్గాన్నే ఎంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement