Saturday, April 20, 2024

Dog Attack : ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి..

చొప్పదండి : చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో ఆదివారం ఉదయం మడుపు రవితేజ (8) అనే బాలుడు కుక్క కాటుతో తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడు తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా కుక్క కరిచిందని, బాలుడు కేకలు వేయడంతో బాలుడి తల్లి వెళ్లి రక్షించినట్లు గ్రామస్థులు తెలిపారు. బాలుడిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

జిల్లా పంచాయతీ అధికారిని సస్పెండ్ చేయాలి : ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి
ప్రజలకు ప్రాణ సంకటంగా తయారయిన కుక్కల బెడదను నివారించమని ప్రజలు ఎన్ని సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ
జిల్లా అధికార యంత్రాంగం కాలం చెల్లిన చట్టాలను అడ్డు పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చొప్పదండి మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, స్థానిక ఎంపీటీసీ సింగిరెడ్డి కృష్ణారెడ్డి విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలు వృద్ధులకు ప్రమాధకరంగా తయారయిన కుక్కలను సంహరించి నివారించాలని, పందులను ఊరు వెలుపలికి తరలించాలని, జిల్లా పంచాయతీ అధికారిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement