Thursday, April 25, 2024

కేసీఆర్‌ పాలనలోనే పల్లెల అభివృద్ధి.. ఎమ్మెల్యే దాసరి

ఓదెల, (ప్రభన్యూస్‌): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు – అనంతరం ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాతే పల్లె, పట్టణాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహ‌ర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పోత్కాపల్లి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా నిర్మాణం చేసే సీసీ రోడ్లకు, పొత్కపల్లి హైస్కూల్లో కోటికి పైగా నిధులతో నిర్మాణం తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్యంలో అన్ని రంగాల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులు చేసి చూపిస్తున్నామన్నారు.

రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని, ఓదెల మండలంలో అభివృద్ధి ప‌నులు నిరంతరం సాగుతాయన్నారు. ప్రజలు సైతం ప్రజల కోసం పనిచేసే సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. అంతకు ముందు పోత్కపల్లి హైస్కూల్లో చదువుల తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక సర్పంచ్‌ ఆళ్ల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆళ్ల శ్రీనివాస్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ వంగ శ్రీనివాస్‌, ఎస్‌ఎంసి చైర్మన్‌ మాచర్ల మౌనిక, ఎంఈవో రాజన్న, మండల పంచాయతీరాజ్‌ శాఖ అధికారి సమ్మిరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు కావాటి రాజు, హైస్కూలు హెచ్‌ఎం సమ్మయ్య, నాయకులు ఐరెడ్డి వెంకటరెడ్డి, ఆకుల మహేందర్‌, చిన్నస్వామి, గుండేటి మధు గుర్రం పద్మ, ఐరెడ్డి కిషన్‌ రెడ్డి, ఆరెల్లి మొండయ్య లతో పాటు మండలంలోని సర్పంచులు, ఎంపిటిసిలు, బీఆర్ ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement