Friday, April 26, 2024

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్ర భుత్వం కృషి చేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి పేర్కొన్నారు. సోమవారం సుల్తానాబాద్‌ మండలం కొదురుపాక గ్రామంలో ఎంజీ ఎన్‌ఆర్‌ ఈజీఎస్‌ నిధుల ద్వారా 9.5 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దాసరి శంకుస్థాపన చెశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడన్నారు. గ్రామాలలో మౌళిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో నిధులను సద్వనియోగం చేసుకొని అభివృద్ధి పనులను విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్‌ చందర్‌ రావు,యూత్‌ మండలాధ్యక్షుడు గుడుగుల సతీష్‌, సర్పంచ్‌ సాగర్‌ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు కందుకూరి సురేష్‌, తోడేటి బాలాజీ, సాగర్‌ రావు, రాకేష్‌, రాయమల్లు, కనకయ్య, మహేందర్‌, విజయ్‌, చంద్రయ్య, శ్రావణ్‌, సురేష్‌, సాగర్‌, సుధాకర్‌ రావు, రాజయ్య, లింగయ్య, బాపు, సామేల్‌, పాలకవర్గం, కుల సంఘాల నాయకులు, బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement