Tuesday, April 23, 2024

అందరికీ కరోనా వ్యాక్సిన్..

ముత్తారం: ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణకు టీ కా వేయించుకోవాలని జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్‌ పేర్కొన్నారు. మండలంలోని కేశనపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నూనె కుమార్‌ ఆధ్వర్యంలో టీకా ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ శానిటైజర్‌తో పాటు మాస్కు తప్పని సరిగా ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. రోగనిరోధక శక్తిని పెంచే పప్పుదినుసులు మాంసం, చేపలు, కోడిగుడ్లతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వైద్యున్ని సంప్రదించాలన్నారు. మండల వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ మాట్లాడుతూ కరోనా రోజురోజుకు ప్రబలుతుండడంతో ప్రజారోగ్య రక్షణ కు చర్యలు చేపట్టామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసి రామగళ్ల పోచమ్మ మధుకర్‌, ఉపసర్పంచ్‌ తాత స్వప్న బాలు, వార్డ్‌సభ్యులు చుంచు రమేష్‌, రామగళ్ల రాధ రమేష్‌, నాయకులు గాజుల శ్రీనివాస్‌, చిందం సదానందం, మంథని సతీష్‌, పంచాయతీ, వైద్య సిబ్బంది, ఏఎన్‌ ఎం కళావతి, రాజేశ్వరి, శారద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement