Friday, April 19, 2024

కరోనా వ్యాక్సిన్‌ వైపు ప్రజల చూపు..

ఓదెల: ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సిన్‌ వైపు ప్రజల దృష్టి సారించారు. మొదట్లో వ్యాక్సిన్‌ కోసం ముందుకు రాని జనం ప్రస్తుతం టీకా వేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 45 ఏళ్లు నిండిన వారంతా టీ-కాలు వేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో వ్యాక్సిన్‌ కార్యక్రమం ఇన్నాళ్లు మందకొడిగా సాగినా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో సందడి పెరిగింది. పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో పాటు- పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం వ్యాక్సిన్‌ తీసుకొని టీ-కాపై అపోహలు వద్దని, అర్హులైన వారం తా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించడంతో ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని వైద్యులు పేర్కొంటు-న్నారు. దీంతో సోమవారం మండల కేంద్రం ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు క్యూలో నిరీక్షించారు. ఈసందర్భంగా ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ లావణ్య మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వారంతా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వ్యాక్సిన్‌ తీసుకోవాలని, వ్యాక్సిన్‌తో ఎలాంటి ఇబ్బందులుండవని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది సైతం వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తారని, ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement