Thursday, March 28, 2024

ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ల నిర్మాణం : మంత్రి గంగుల

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ని 2వ అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామని,
కరీంనగరాన్ని పరిశుభ్రమైన… ఆరోగ్యవంతమైన.. గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో 2.68 కోట్లతో చేపట్టనున్న ఐలాండ్ల నిర్మాణ పనులకు నగరంలోని ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద మంత్రి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూడళ్ళలో నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 13 కూడళ్ళలో ఇప్పటివరకు 7 కూడళ్ళ పనులకు టెండర్లు పూర్తయి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, మరో 6 కూడళ్ళకు టెండర్లను త్వరితగతిన పూర్తి చేసి మార్చి 31 లోగా 13 జంక్షన్ లను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement