Saturday, April 20, 2024

టెన్త్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనయి. పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సోమవారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్, వాణి నికేతన్ బాలవికాస్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎవరు కూడా మొబైల్ ఫోన్ లను తీసుకొని రాకుండా చూడాలని, విద్యార్థులు, ఇన్విజిలేటర్లు కోవిడ్ నిబందనలను పాటిస్తూ మాస్క్ ను తప్పకుండా ధరించాలన్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ మీడియంల వారిగా పశ్నా పత్రాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని, వేసవి దృష్ట్యా విద్యార్థులకు చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బందులకు గురికాకుండా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఓఎంఆర్ షీట్, పశ్నా పత్రాలను పరిశీలించారు. విద్యార్థులు పరీక్షా సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement