Friday, February 3, 2023

బీఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌తో బీజేపీలో వణుకు : జీవీ రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభ విజయవంతం కావడంతో బీజేపీ నాయకులకు వణుకు పుట్టి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని కరీంనగర్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు విమర్శించారు. పత్రికా సమావేశంలో జివి రామకృష్ణారావు మాట్లాడుతూ బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మాటతప్పి ప్రజలతో చెలగాటమాడుతు మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి పై, కేసీఆర్ కుటుంబం పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జివిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం పై , సీఎం కేసీఆర్ పై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. కళ్ళు లేని కబోదులు బీజేపీ నాయకులని నిజాలను గ్రహించి మాట్లాడాలని బీజేపీ నాయకులకు చురకలటించారు. వాగ్దానాలు నెరవేర్చకుండా మాట తప్పింది మీరా మేమా అని సూటిగా ప్రశ్నించారు. నల్లధనం వెలికి తీస్తామని, జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని, సంవత్సరానికి ఉద్యోగాల హామీ ఇచ్చి మాట తప్పింది బిజెపి ప్రభుత్వమని ఎద్దేవ చేశారు మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఐటీ సంస్థల్లో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇందుకుగాను గోల్డ్ ఐకాన్ డిజిటల్ ఇండియా అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల్లో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ప్రవీణ్ పవార్ అవార్డును అందించారని వివరించారు. గ్రీన్ చాలెంజ్ అవార్డు, హరితహారం లో భారతదేశంలోనే తెలంగాణ కు మొదటి స్థానం దక్కిందని గుర్తు చేశారు. 20 22 సంవత్సరంలో ఓల్డ్ గ్రీన్ సిటీ అవార్డు, ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర పథకం మిషన్ భగీరథకు గాను గజేంద్ర సింగ్ శకావత్ ఈ అవార్డు ఇచ్చారని, స్వచ్ఛ సర్వేక్షన్ లో తెలంగాణ రాష్ట్రం నుండి 16 మున్సిపాలిటీలకు సముచిత స్థానం దక్కిందని తేల్చి చెప్పారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement