Sunday, April 14, 2024

ఇటుక ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు ఒరిస్సా కార్మికులకు గాయాలు..

పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్ గ్రామ పంచాయ‌తీ పరిధి దస్తగిరిపల్లి వద్ద ఇటుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు ఒరిస్సా కార్మికులకు గాయాలయ్యాయి. పెద్దపల్లి సమీపంలోని ఇటుక బట్టీ నుండి కొత్తపల్లి వైపు ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దస్తగిరిపల్లి మూల మలుపు వద్ద ప్రమాద వశాత్తూ బోల్తా పడింది. ట్రాలీ కింద ఇటుకల్లో ఒరిస్సా కార్మికులు చిక్కుకోవడంతో రోడ్డు వెంట వెళ్ళేవారు ఇటుకలను తొలగించి కార్మికులను రక్షించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సురేష్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని కార్మికులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో కార్మికులు బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement