Sunday, August 1, 2021

సునీల్ ఆత్మహత్య.. విద్యార్థుల నిరసన

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీవైఎం డిమాండ్ చేసింది. కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా  బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్య సాధన కొరకు ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ ఆశయ సాధన కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సునీల్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. గూడూరు మండలం రామ్‌సింగ్ తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ సంఖ్యలో విద్యార్థి సంఘాల నాయకులు అంత్యక్రియలకు హాజరయ్యారు. కాగా, ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేయడం లేదనే మనస్థాపంతో ఐదుగురోజుల క్రితం పురుగుల మందు తాగిని సునీల్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News