Friday, April 19, 2024

ఘనంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు..

ఇల్లంతకుంట: మండలంలో బిజెపి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం, వల్లంపట్లతోపాటు 58 పోలింగ్‌ బూత్‌ల్లో పార్టీ జెండాను మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి, బిజెవైఎం జిల్లా అధికార ప్రతినిధి అంజియాదవ్‌లు వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్‌, మండల యువ మోర్చా అధ్యక్షులు బండారి రాజ్‌, తిప్పారపు శ్రవణ్‌, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్‌, భూమాళ్ల అనిల్‌, మామిడి శేఖర్‌, గౌరవేణి శ్రీకాంత్‌, గంగం అనిల్‌, చల్లూరి భాను, గొల్లపల్లి ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement