Tuesday, May 30, 2023

సొసైటీల ద్వారా రైతులకు మెరుగైన సేవలు : ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి రూరల్, మార్చి 2 (ప్రభ న్యూస్) : పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, సహకార సంఘాల రాష్త్ర ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు తో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొసైటీల ద్వారా రైతులకు అనేక మెరుగైన‌ సేవలందుతున్నాయని తెలిపారు. అప్పన్నపేట సొసైటీలో రైతులు, ఆయా గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విండో ఛైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ చింతపండు సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement