Tuesday, March 21, 2023

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. బాల్క సుమన్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈరోజు జైపూర్ మండలం కుందారం గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.

- Advertisement -
   

గ్రామీణ ప్రజలకు సైతం మెరుగైన వైద్య సేవలందించేందుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కేసీఆర్ కిట్ పథకం అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement