Thursday, April 25, 2024

కుక్కల దాడిలో బర్రె మృతి..

వీణవంక : వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన చింతల శంకర్ రెడ్డికి చెందిన బర్రెపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు 20 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కుక్కలను పట్టుకుని ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని గ్రామ ప్రజలు కోరుచున్నారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో మనుషులపై కూడా దాడులు జరిగినా కానీ అధికారులు కానీ ప్రజాప్రతిని గాని ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement